Monday, July 20, 2009

"వేదం"లో వేశ్యాభినయం?


Vedam Telugu Movie Details

‘అరుంధతి’గా అఖిలాంధ్ర ప్రేక్షకుల్ని అలరించిన అందాల భామ అనుష్క ‘వేదం’ చిత్రంలో వేశ్యగా నటించనున్నట్టు తెలుస్తోంది. ‘గమ్యం’ దర్శకుడు రాధాకృష్ణ (క్రిష్‌) ద్వితీయ ప్రయత్నంగా రూపొందిస్తున్న ‘వేదం’ చిత్రంలో అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌లతోపాటు అనుష్క ముఖ్యపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ‘బిల్లా’లో బికినీ ధరించి రసజ్ఞుల హృదయాలను కొల్లగొట్టిన ఈ కన్నడిగ ‘వేదం’ చిత్రంలో వేశ్య పాత్ర పోషిస్తుందన్న వార్త అందరి గుండెల్లో కలవరం పుట్టించనుంది. ప్రస్తుతం తెలుగులో ‘వరుడు’ చిత్రంలో మహేష్‌బాబు సరసన ‘వధువు’గా నటిస్తున్న అనుష్క, తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. మొత్తానికి ఇప్పటికే హాట్‌ ఫేవరెట్‌గా ఉన్న అనుష్క ఈ వేశ్య పాత్ర ద్వారా మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

No comments: